Headlines

Happy Journey Trailer: ఆకట్టుకుంటున్న హ్యాపీ జర్నీ మూవీ ట్రైలర్.. ఓ లుక్కేసేయండి


ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా అనిపించే ప్రయాణం.. ‘హ్యాపీ జర్నీ’లో అదే ఆలోచనను ఏడుగురు మహిళల జీవితాలు, అనుభవాల ద్వారా ఆసక్తికరంగా చూపించారు. ఏడు మంది మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలను పోషించారు. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ల పై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న ‘హ్యాపీ జర్నీ’ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్

ట్రైలర్ ఏడుగురు మహిళలు టూరిస్ట్ గైడ్ సహాయంతో యూరప్ ట్రిప్‌కు బయలుదేరడంతో ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో కథ, సమస్య, వ్యక్తిత్వం, జీవితంపై ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కలిసి గడిపే సమయాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్లు జర్నీని ప్రారంభిస్తారు. అయితే విభిన్న వ్యక్తిత్వాల కారణంగా త్వరలోనే వారి మధ్య భేదాభిప్రాయాలు, గొడవలు మొదలవుతాయి. జర్నీ కొనసాగుతున్న కొద్దీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టి, చివరకు బలమైన, అందమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు.

అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

విభిన్న వయసులు, విభిన్న నేపథ్యాలకు చెందిన మహిళలు ఒకే జర్నీలో కలుసుకోవడం ఈ కథలో ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తోంది. అందమైన యూరప్ లొకేషన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, వ్యక్తిగత అనుభవాలు, పూర్తిగా భిన్నమైన వ్యక్తులు ఒకే ప్రయాణాన్ని పంచుకున్నప్పుడు ఏర్పడే అనుకోని బంధాలను ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. దర్శకుడు అభిరామ్ నాయుడు హ్యూమర్, ఎమోషన్‌ను చక్కగా బ్యాలెన్స్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా తమ పాత్రల్లో విభిన్న వ్యక్తిత్వాలు, ఎమోషన్స్‌ను చూపించారు. కథలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండగా.. నటీనటులు తమ పాత్రలకు సహజత్వం, ఆకర్షణను తీసుకొచ్చారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి



నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో

Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్‌ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *