Andhra Pradesh: వాళ్లు బతికే ఉన్నారు.. నేపాల్ వరద బాధితుల కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
Andhra Pradesh: నేపాల్‌లో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో గల్లంతైనట్లు ప్రచారం జరిగిన పార్వతీపురానికి చెందిన సాహు కుటుంబం పై కొంత ఊరట కలిగించే సమాచారం కుటుంబసభ్యులు వెల్లడించారు. పార్వతీపురం పట్టణం పండా వీధికి చెందిన సంతోష్ కుమార్ సాహు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు వరదల్లో కొట్టుకుపోలేదని, ప్రమాదం సంభవించడానికి ముందే వారు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం అందటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంతోష్ కుమార్ సాహు…