వెల్ డన్ ఛాంపియన్స్.. చాలా గర్వంగా ఉంది.. టీమిండియా గెలుపుపై ప్రధాని మోదీ ప్రశంసలు..
భారత క్రికెట్ జట్టు మరోసారి గర్జించింది.అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేస్తూ భారత్ మూడోసారి T20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఈ విజయంతో భారత్ కేవలం ట్రోఫీని గెలవడమే కాకుండా సొంత గడ్డపై టైటిల్ సాధించిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాను ఆయన ఆకాశానికెత్తారు. ఈ విజయం కేవలం క్రీడా విజయం…