సూర్యవంశీకి షాకిచ్చిన బీసీసీఐ..టీమ్ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరగనున్న సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశమైంది. కేవలం 15 ఏళ్ల వయసు కలిగిన వైభవ్‌ను సెలెక్టర్లు ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, దీనికి స్పష్టమైన కారణం వెల్లడైంది. సెప్టెంబరు 18 నుండి అక్టోబరు 5 వరకు ఆస్ట్రేలియా U19 జట్టు భారత్‌లో సిరీస్ ఆడనుండగా, అదే సమయంలో సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 3…