నేను మహారాష్ట్రలోనే ఉంటా.. గాల్లో మేడలు కట్టొద్దు.. కేంద్ర కేబినెట్ ప్రచారంపై ఫడ్నవీస్ క్లారిటీ..
కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందన్న ప్రచారంతో పాటు తాను కేంద్ర కేబినెట్‌లో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టతనిచ్చారు. తాను మహారాష్ట్రలోనే ఉంటానని, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవ చేయడమే తన కర్తవ్యమని స్పష్టం చేస్తూ ఆ ఊహాగానాలకు తెరదించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఫడ్నవీస్ సమావేశమయ్యారు. మహారాష్ట్రలోని పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర నిధులు, అనుమతులపై ప్రధానితో చర్చించారు. అనంతరం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి…