Headlines

Basinga Ballalu Song: 11 లక్షల బడ్జెట్… కోట్లలో వ్యూస్!.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాసింగా బలాలు సాంగ్.. ఎంత లాభం వచ్చిందంటే..

తెలంగాణ ఫోక్ సాంగ్స్.. కేవలం రాష్ట్రం కాదు.. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశాలు దాటి మరి పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బాసింగా బలాలు సాంగ్ మారుమోగుతుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ నెట్టింట ఏ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయో చెప్పక్కర్లేదు. అచ్చమైన తెలంగాణ యాస, పల్లెటూరి పదాలు, సింపుల్ ట్యూన్, క్యాచీ బీట్ తో ఉండే పాటలు ఇప్పుడు యువతను తెగ…

Read More

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

హైదరాబాద్‌లోని బోనాల పండుగలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న నటి ఫరియా అబ్దుల్లా, సోషల్ మీడియాలో తీవ్ర మతపరమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. ముస్లిం అయి ఉండి హిందూ పండుగలో ఎలా పాల్గొంటావంటూ ఆమెను కాఫీర్ అని దూషించారు. ఈ విమర్శలతో మనస్తాపం చెందిన ఫరియా అబ్దుల్లా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన వ్యక్తిగత నేపథ్యం గురించి వివరిస్తూ, తన తండ్రి ప్రేమతో ఇస్లాంను స్వీకరించారని, మతాన్ని ప్రేమతో చూసే వాతావరణంలో తాను పెరిగానని ఫరియా తెలిపారు. దేవుణ్ణి ప్రతిచోటా,…

Read More

ఆ పెద్ద హీరోని హ్యాండిల్ చేయడం నావల్ల కాదు.. దేవుడి దయ ఉంటే ఆయనతో సినిమా చేస్తా: వేణు

బలగం సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన వేణు యెల్దండి, తన సినీ ప్రస్థానం, రచయితగా అందించిన సహకారం, అలాగే  పెద్ద హీరోలతో సినిమా చేసే సవాళ్లపై తన అనుభవాలను పంచుకున్నారు. గతంలో కమెడియన్ గా నవ్వులు పూయించిన వేణు ఆతర్వాత దర్శకుడిగా మారాడు. ఇక బలగం సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . కాగా ఓ ఇంటర్వ్యూలో వేణు…

Read More

అన్నం బదులు దీన్ని తినండి.. బరువును వెన్నలా కరిగిస్తుంది.. డయాబెటిస్ పూర్తిగా కంట్రోల్..

జొన్న జావ అనేది సంప్రదాయకంగా మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది కేవలం రుచికరమైనదే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన అద్భుతమైన వంటకం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఈ జొన్న జావ ఒక ఆదర్శవంతమైన అల్పాహారం లేదా రాత్రి భోజనం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎన్నో పోషకాలు కలిగిన జొన్నలతో ఆహారం తయారు చేసుకోవడంతోపాటు.. జావను కూడా సిద్ధం చేసుకోవచ్చు.. వాస్తవానికి జొన్నలలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. పీచు…

Read More

తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30 లక్షల జీతం

అమరావతి, ఆగస్ట్‌ 19: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో రాష్ట్ర యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కంచిబాబు తెలిపారు. అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా షెడ్యూల్డ్‌ కులాలు (SC), షెడ్యూల్డ్‌ తెగలు (ST) వర్గాలకు చెందిన యువతకు ఈ కార్యక్రమం ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ‘జర్మనీ జాబ్‌ ఆపర్చునిటీ ప్రోగ్రామ్‌’ ద్వారా…

Read More

IND VS SL: భారత్ ఆశలపై నీళ్లు చల్లనున్న వర్షం.. గాలే టెస్ట్ క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్.. గెలుపు ఎవరిది?

IND VS SL: గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్ట్ ఐదో రోజు ఆటపై మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే ఉదయం సమయంలోనే భారీ వర్షం కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి రెండు సెషన్లలో వర్షం తీవ్రత కాస్త తగ్గినప్పటికీ, ఆకాశం నల్లటి మబ్బులతో నిండి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒకవేళ వర్షం తీవ్రమై మైదానం మైదాన సిబ్బంది నియంత్రణలోకి రాకపోతే, ఐదో రోజు ఆట మొత్తం…

Read More

Varalakshmi Vratam: వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు? లక్ష్మీదేవి కటాక్షం వెనుక ఉన్న అసలు విశేషం ఇదే!

Varalakshmi Vrat Telugu: శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటిగా భావిస్తారు. లక్ష్మీదేవి ఆరాధనకు సాధారణంగా అన్ని శుక్రవారాలూ శుభప్రదమైనవే అయినప్పటికీ, శ్రావణ మాసంలోని శుక్రవారాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా స్త్రీలు కుటుంబ సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, శుభం కోసం వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. శ్రావణ మాసం పూజలు, వ్రతాలకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక సాధన, జ్ఞాన సముపార్జనకు కూడా అనుకూలమైన కాలంగా…

Read More

Ram Charan: ఇరుముడిలో మెగా పవర్ స్టార్ పవర్ ఫుల్ రోల్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. అలాగే ఈ…

Read More

WhatsApp: చాట్ తెరవకుండానే ఫోటోలు, వీడియోలు చూడవచ్చు.. వాట్సాఫ్‌లో కొత్త ఫీచర్..!

WhatsApp: వాట్సాప్‌లోకి ఒక కొత్త ఫీచర్ రాబోతోంది. ఇకపై ఏ చాట్‌ను తెరవకుండానే, అందులో ఎలాంటి చిత్రాలు, వీడియోలు లేదా స్టిక్కర్లు పంపారో మీరు తెలుసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ఆండ్రాయిడ్ ఎంపిక చేసిన బీటా వినియోగదారుల కోసం కొత్త మీడియా ప్రివ్యూ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 2.26.32.11 వెర్షన్ వాట్సాప్ బీటాలోని కొంతమంది వినియోగదారులకు ఈ సౌకర్యం లభిస్తున్నట్లు తెలిసింది. ఈ ఫీచర్‌ను క్రమంగా ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వాట్సాప్‌లో ఏమి…

Read More

Onion Chutney: కూరగాయలు లేనప్పుడు గ్యాస్‌తో పనేలేకుండా 5 నిమిషాల్లో చేసుకునే కమ్మని ఉల్లిపాయ పచ్చడి!

కావలసిన పదార్థాలు: రెండు పెద్ద ఉల్లిపాయలు, దోరగా ఉన్న ఒక టమాటా, రెండు పచ్చిమిర్చి, ఒక స్పూన్ కారం పొడి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు (10 నుండి 15), ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, రెండు ఎండుమిర్చి, ఒక రెమ్మ తాజా కరివేపాకు మరియు ఒక చిన్న కప్పు నూనె. తయారీ విధానం: ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయల పొట్టు తీసి చాలా సన్నని ముక్కలుగా…

Read More