తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త.. పోలీసుల కీలక సూచనలు!
తిరుమల శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, భక్తుల భద్రత దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆదేశాలతో తిరుమలలోని పార్కింగ్ ప్రాంతాల్లో గురువారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రాంబగీచ కార్ పార్కింగ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రుధ్ర శ్యామ్ బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా తిరుమలలోని వివిధ కార్ పార్కింగ్ ప్రాంతాల్లో…