ఆటో పేమెంట్ ఈ-మాండేట్ల సమాచారం మొత్తం ఒకే చోట లభించనుంది. ఒకే యాప్‌లో న్నీ కరిపించనున్నారు. డిజిటల్ చెల్లింపులను వినియోగదారులు ఒకేచోట యాక్సెస్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఈ కొత్త సిస్టమ్‌ను అభిృద్ది చేస్తోంది. దీని వల్ల వినియోగదారులు ఇ-మాండేట్లను ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ థర్డ్-పార్టీ యాప్‌లలో ఒకే చోట చూసుకోవచ్చు. ఇందుకోసం వేర్వేరు ఫ్లా్ట్ఫామ్లను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. దీని ఒకే యాప్‌లో ఈటో పేమెంట్ సమాచారం, సబ్స్క్రిప్షన్లను నిర్వహించుకోవ్చు. నెలవారీ సబ్స్క్రిప్షన్లు, బిల్లులు, ఈఎంఐలు లాంటి వాటిని ట్రాక్ చేసుకోవచ్చు. అన్ని యూపీఐ యాప్‌లకు అందుబాటులో ఉండేలా అప్లికేషన్ ఇంటర్ఫేస్ (API)ను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్పీసీఐ అభివృద్ధి చేస్తోంది.
ఏ యూపీఐ యాప్ నుంచైనా..
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఏ యూపీఐ యాప్‌లోనైనా సరే మీ యాక్టివ్ ఆటో-పేలు, మాండేట్లు ఒకే చోట నిర్వహించుకోవచ్చు. కానీ మీరు సబ్స్క్రిప్షన్న్లను రద్దు చేయాలన్నా లేదా మార్చాలనుకుంటే మీరు ఎక్కడైతే తొలిసారి క్రియేట్ చేశారో ఆ యాప్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మీరు ప్రస్తుతం వాడుతున్న యాప్ మిమ్మల్ని నేరుగా ఆ యాప్‌కు మళ్లిస్తుంది. ఇటీవ యూపీఐ ఆటోపే లావాదేవీలు విఫలం కావడం ఒక ముఖ్యమైన సమస్యగా మారిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కేవలం 30 శాతం ఆటో పేమెంట్ లావాదేవీలు మాత్రమే విజయవంతం అవుతుండా.. 70 శాతం లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయి. కస్టమర్ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం లేదా ఇతర వ్యాపార సమస్యల వల్ల ఫెయిల్ అవుతున్నాయి.
ఎక్కువగా ఈ అకౌంట్ల నుంచే..
అయితే స్టోర్లు లేదా వెబ్సైట్లలో మీ కార్డును సేవ్ చేసి ఆటో-పే ఏర్పాటు చేసుకునే కార్డ్ ఆధారిత మాండేట్ల కంటే.. యూపీఐ ఇ-మాండేట్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ మంది ఈ సేవను విశ్వసించేలా ఎన్పీసీఐ తన అంతర్గత వ్యవస్థలను మరింత క్రమబద్ధీకరించాలని కోరుకుంటోంది. దేశంలో యూపీఐ వినియోగం పెరుగుతోంది. రికార్డ్ స్థాయిలో ఆటో యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. దీంతో ఆటోపే వాడకం కూడా వేగంగా పెరుగుతోంది. ఈ తరుణంలో ఈ కొత్త ఫీచర్ తీసుకురావాలని చూస్తోంది.ఇ-మాండేట్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలను ఎక్కువగా వినియోగదారులు ఉపయోగిస్తున్నారు.