Headlines

అతను ఇంత పెద్ద హీరో అవుతాడని అస్సలు అనుకోలేదు.. రెజీనా షాకింగ్ కామెంట్స్


 2012లో వచ్చిన ‘శివ మనసులో శ్రుతి’ సినిమాతో రెజీనా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రంలో తన సహజమైన నటనతో ఆకట్టుకున్న ఆమెకు మంచి గుర్తింపు లభించింది. అంతేకాదు, ఈ సినిమాతోనే సైమా ఉత్తమ తొలి నటి అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత రెజీనా తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘కొత్త జంట’, ‘పవర్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘నక్షత్రం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తన గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *