ఒక ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్.. కేంద్రం కొత్త రూల్.. జూన్ 30 తర్వాత కఠిన చర్యలు!

ఒక ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్.. కేంద్రం కొత్త రూల్.. జూన్ 30 తర్వాత కఠిన చర్యలు!


​మీ ఇంట్లో LPG సిలిండర్ వాడుతున్నారా? అదే సమయంలో PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్ కూడా ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా “One Household, One Gas Connection” (ఒక ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, ఒకే ఇంట్లో రెండు రకాల గ్యాస్ కనెక్షన్లు ఉండటానికి వీల్లేదు. ఒకవేళ మీ ప్రాంతంలో PNG సౌకర్యం అందుబాటులో ఉంటే, మీరు తప్పనిసరిగా LPGని వదులుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *