Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌.. మూడు పుణ్యక్షేత్రలను కలిపే ప్రత్యేక రైలు

Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌.. మూడు పుణ్యక్షేత్రలను కలిపే ప్రత్యేక రైలు


Indian Railways: మన ఇండియన్‌ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రవాణా వ్యవస్థ జాబితాలో ఉంది. దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. అయితే ప్రయాణికుల కోసం భారత రైల్వే ఎన్నో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే సాధారణంగా మన తెలుగు ప్రజలు తిరుపతితో పాటు అరుణాచలం, శ్రీరంగం ఆలయాలను కూడా చూడాలంటే ప్రత్యేక రైలు అంటూ ఏమి లేదు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుండి ఈ మూడు పుణ్యక్షేత్రాలను కలిపే ఒక్క రైలు కూడా లేదు. దీనివల్ల భక్తులు వేర్వేరు రైళ్లు మారుతూ చాలా ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా ఫ్యామిలీతో వెళ్లేవారికి ఈ ప్రయాణం పెద్ద సమస్యగా ఉండేది. ఈ కష్టాలను గుర్తించిన రైల్వే శాఖ.. ఒకే రైలులో ఈ మూడు ప్రముఖ ఆలయాలను దర్శించుకునేలా ఈ సరికొత్త వీక్లీ ట్రైన్‌ను అందుబాటులోకి తెచ్చింది రైల్వే శాఖ.

చర్లపల్లి – తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్: 17077)

ఈ రైలు ప్రతి మంగళవారం సాయంత్రం 5:20 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ప్రయాణిస్తుంది. తరువాత రోజు అంటే బుధవారం ఉదయం 8:50 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకోవాలనుకునే వారికి ఇది సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటివరకు హైదరాబాద్ నుండి చర్లపల్లి – తిరుచిరాపల్లి మధ్య ఒక స్పెషల్ ట్రైన్ నడిచేది. ఇప్పుడు ఈ రైలును తాత్కాలికంగా కాకుండా శాశ్వత వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా అంటే వారానికి ఒకసారి నడిచే రైలుగా మార్చారు. దక్షిణ మధ్య రైల్వే ప్రకారం.. 17077, 17078 నంబర్లతో ఈ రైలు జూలై 7వ తేదీ నుండి క్రమం తప్పకుండా నడుస్తుంది.

ఇది కూడా చదవండి: OYO: ఓయోకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త..!

ఇవి కూడా చదవండి

తిరుపతి తర్వాత రేణిగుంట, చిత్తూరు, కాట్పాడి మీదుగా అరుణాచలం (తిరువణ్ణామలై) చేరుకుంటుంది. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఈ ట్రైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అక్కడి నుండి విల్లుపురం, విరుద్దాచలం, అరియలూర్, శ్రీరంగం( శ్రీ రంగనాథస్వామి ఆలయం) మీదుగా బుధవారం సాయంత్రం 6:45 గంటలకు తిరుచిరాపల్లి చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణం:

ఇక ఈ రైలు తిరుగు ప్రయాణం విషయానికోస్తే.. తిరుచిరాపల్లి – చర్లపల్లి (ట్రైన్ నంబర్: 17078) మళ్లీ హైదరాబాద్ రావడానికి ఈ రైలు ప్రతి బుధవారం రాత్రి 9:30 గంటలకు తిరుచిరాపల్లిలో బయలుదేరి శ్రీరంగం, అరుణాచలం, తిరుపతి మీదుగా ప్రయాణించి గురువారం రాత్రికి చర్లపల్లి చేరుకుంటుంది. ఈ విధంగా ఈ ప్రత్యేక రైలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.

ఇది కూడా చదవండి: Silver: ఇక వెండి కొనడం అంత సులభం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం..!

ఇది కూడా చదవండి: Fact Check: ఎంట్రా ఇలా తయారయ్యారు.. ఇలాంటివి చూసే జనాలు పరేషాన్ అవుతున్నారు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *