ఐటీ, ఏఐ రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్.. ‘నమో’ దేశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు!

ఐటీ, ఏఐ రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్.. ‘నమో’ దేశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు!


రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (SPIEF 2026) ప్లీనరీ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సదస్సులో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రసంగించిన ఆయన, గ్లోబల్ ఐటీ (IT) పరిశ్రమలో భారతదేశాన్ని ఒక అత్యంత కీలక భాగస్వామిగా, అగ్రగామిగా కొనియాడారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని పుతిన్ పేర్కొన్నారు. గ్లోబల్ డెవలప్‌మెంట్ యొక్క మూల నమూనానే మారుతోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో వర్తమానాన్ని, భవిష్యత్తును శాసించబోయే మూడు కీలక సాంకేతికతలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అటానమస్ సిస్టమ్స్, మరియు ప్లాట్‌ఫామ్-ఆధారిత పరిష్కారాలను పుతిన్ ప్రత్యేకంగా గుర్తించారు. రాబోయే రోజుల్లో ఏ దేశాలైతే ఈ అధునాతన సాంకేతిక రంగాలలో తిరుగులేని నాయకత్వాన్ని ప్రదర్శిస్తాయో.. అవే ప్రపంచ మార్కెట్‌లో ఆర్థిక పోటీతత్వాన్ని, తమ సాంకేతిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోగలవని ఆయన విశ్లేషించారు.

మరోవైపు, పరిమిత సంఖ్యలో ఉన్న కొన్ని పాశ్చాత్య దేశాల నియంత్రణలోనే ప్రపంచ వాణిజ్యం, సమాచార నెట్‌వర్క్‌లు కేంద్రీకృతం కావడం వల్ల ఇతర దేశాలు రాజకీయ పరాధీనతను ఎదుర్కోవాల్సి వస్తోందని పుతిన్ ఆరోపించారు. ఐరోపాలోని కొన్ని ఉన్నత వర్గాలు మరిన్ని దేశాలను అస్థిరత, సంఘర్షణల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇలాంటి తరుణంలో సాంకేతిక రంగంలో భారత్ లాంటి దేశాల పాత్ర ఎంతో కీలకమని పుతిన్ స్పష్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *