Central Government: ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.20 వేలు.. కేంద్రం అదిరిపోయే స్కీమ్.. ఎవరెవరు అర్హులంటే..?

Central Government: ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.20 వేలు.. కేంద్రం అదిరిపోయే స్కీమ్.. ఎవరెవరు అర్హులంటే..?


దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. డబ్బులు పెట్టుబడి పెట్టి ఆదాయం పొందాలనుకునేవారి కోసం అనేక సేవింగ్స్ స్కీమ్ ప్రవేశపెడుతోంది. వివిధ వర్గాల కోసం ప్రత్యేకంగా చిన్న పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు. ప్రతీ నెలా లేదా మూడు నెలలు, ఆరు నెలలకు, ఏడాదికి ఒకసారి ప్రీమియం కట్టవచ్చు. ప్రతీ నెలా చిన్న మొత్తంలో పొదుపు చేసుకుని దీర్ఘకాంలో పెద్ద మొత్తంలో రాబడి రావాలనుకునేవారికి మంచి పథకాలు ఉన్నాయి. ఇక ఒకేసారి డబ్బులు పెట్టుబడి పెడితే ఐదేళ్ల తర్వాత ఆదాయ పొందే అవకాశం కూడా ఉంది. అటువంటి స్కీముల్లో ఒకటి సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకం ప్రత్యేకతలు ఏంటి..? ఎవరు పెట్టుబడి పెట్టాలి..? పెట్టుడి పెడితే ఎంత వస్తుంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ప్రత్యేకతలు ఇవే..

-కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం

-బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధికంగా 8.20 శాతం వడ్డీ లభిస్తుంది

-ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు అనేది మారుతూ ఉంటాయి

-కేంద్రం ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది

-వడ్డీ రేట్లు పెరగవచ్చు.. లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుంది

– 8 శాతంపైనే వడ్డీ రేట్లు ఎప్పుడూ ఉంటాయి

-బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తే అత్యధికంగా 7 శాతం వరకు మాత్రమే వడ్డీ ఉంటుంది. దానితో పోలిస్తే ఈ స్కీమ్‌లో ఎక్కువ

-ప్రస్తుతం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి 8.20 శాతం వడ్డీ రేటు ఉంది

-కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది

-ఐదేళ్ల తర్వాత అవసరమైతే మూడేళ్లు పొడిగించుకోవచ్చు

-కనీసం రూ.వెయ్యి నుంచి పెట్టుబడి స్టార్ట్ చేయవచ్చు

-గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు

-ఒకేసారి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది

-మెచ్యూరిటీ ముగిసిన తర్వాత ఒకేసారి అమౌంట్ వస్తుంది

-ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీ అకౌంట్లో జమ చేస్తారు

-ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే 60 ఏళ్లు నిండి ఉండాలి

ఎంత వస్తుంది..?

-ఉదాహరణకు ఒకేసారి రూ.5 లక్షలు జమ చేశారనుకుందాం. 8.25 శాతం వడ్డీ రేటుతో ప్రతీ మూడు నెలలకు రూ.10,249 ఆదాయం లభిస్తుంది. అంటే నెలకు రూ.3 వేల పైనే ఆదాయం లభిస్తుంది. ఐదేళ్ల మెచ్యూరిటి పీరియడ్ తర్వాత రూ.7.05 లక్షలు అందుతాయి.
రూ.30 లక్షలు జమ చేశారనుకుందాం. ప్రతీ మూడు నెలలకు రూ.61,499 వడ్డీ లభిస్తుంది. అంటే ప్రతీ నెలా రూ.20 వేలు వస్తున్నట్లు.. మెచ్యూరిటీ తర్వాత రూ.42.30 లక్షలు అందుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *