Megastar Chiranjeevi : చిరంజీవి పుట్టినరోజు.. మెగాస్టార్‌కు సరికొత్తగా బర్త్ డే విషెస్.. ఫోటోస్ చూస్తే ఫిదా అయిపోతారు..
తెలుగు సినీ జగత్తులో తమకంటూ ప్రత్యేకాధ్యాయాన్ని లిఖించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు ఆయన పుట్టినరోజును (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే మెగా ఫ్యాన్స్ రకరకాల సేవా కార్యక్రమాలు, వినూత్న వేడుకలతో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన ఒక సూక్ష్మ కళాకారుడు చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని ఎంతో సృజనాత్మకంగా వ్యక్తపరిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్,…