Headlines

ఆగస్టులో చివరి చంద్ర గ్రహణం.. వీరు నిందలు మోయడం ఖాయం!

శ్రావణ మాసంలో ఆగస్టు 28 పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సారి చంద్ర గ్రహణం కన్యారాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఆగస్టు 28 రోజు ఉదయం 8.04 గంటలకు ప్రారంభమై 9:44 గంటలకు పూర్తి అవుతుంది. అయితే మన భారత దేశంలో కనిపించదు, అందువలన సూతక కాలం నియమాలు వర్తించవు. కానీ ఇది రాశులపై మాత్రం ప్రభావం చూపుతుందంట. కాగా, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో చూసేద్దాం.

Read More

MBBS కౌన్సెలింగ్ 2026 షెడ్యూల్‌ మారిందోచ్.. MCC కొత్త టైం టేబుల్ ఇదే

అమరావతి, ఆగస్ట్‌ 22: ఎంబీబీఎస్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) సవరించింది. అఖిల భారత కోటా (AIQ), డీమ్డ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీలకు సంబంధించిన మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో మార్పులు చేసింది. అఖిల భారత కోటా (AIQ), డీమ్డ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీలకు ఆగస్టు 4న ప్రారంభమైన తొలి విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 21 వరకు కొనసాగుతుంది. ఈ రౌండ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 31లోగా సంబంధిత వైద్య కళాశాలలో చేరాల్సి…

Read More

AUS vs BAN: గాయపడిన సింహం వేటకు బంగ్లా బలి.. 64 పరుగులకే మడతపెట్టేశారు

AUS vs BAN: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మైండ్ బ్లాకింగ్ బౌలింగ్‌తో విరుచుకుపడ్డాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ప్రారంభించగానే మ్యాచ్‌లోని అతి మొదటి బంతికే ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్‌ను ప్లాటినం డక్‌గా పెవిలియన్‌కు పంపి స్టార్క్ తన రికార్డుల వేటను మొదలుపెట్టాడు. టెస్టు మ్యాచ్‌లోని తొలి ఓవర్లోనే వికెట్ తీయడం స్టార్క్ కెరీర్లో ఇది తొమ్మిదోసారి కావడం విశేషం. దీనితో ఎనిమిది సార్లు ఈ ఘనత సాధించిన ఇంగ్లండ్ దిగ్గజం…

Read More

15 అడుగుల కొండచిలువకు దవడ క్యాన్సర్.. నయం చేసిన వైద్యులు..

క్యాన్సర్ అనే మహమ్మారి మనుషులను ఇప్పుడు విపరీతంగా కుంగదీస్తుంది. అలాంటిది ఒక పాముకు క్యాన్సర్ సోకితే, దాని ప్రాణాలను కాపాడటం ఎంత పెద్ద సవాల్. బ్రిటన్‌లోని చెస్టర్ జూలో సరిగ్గా ఇలాంటి అద్భుతమే జరిగింది. ఏకంగా 15 అడుగుల భారీ రెటిక్యులేటెడ్ కొండచిలువకు దవడ క్యాన్సర్ సోకగా, వైద్యులు ఓ సాహసోపేతమైన చికిత్సను విజయవంతంగా నిర్వహించి, పశు వైద్య చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. సాధారణంగా మనుషులకు చేసే అధునాతన ఎలక్ట్రో కీమోథెరపీని ఆ పాముకు చేసి…

Read More

Chiranjeevi Birthday: రక్తనిధి, నేత్ర నిధితో మానవత్వాన్ని చాటుకున్నారు.. చిరంజీవికి సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ(ఆగస్టు 22) పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ క్రీడా ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను,…

Read More

లారీని ఢీకొన్న కారు దహనం.. అర్ధరాత్రి కళ్లెదుటే మంటల్లో వ్యక్తి సజీవ దహనం

చింతూరు, ఆగస్ట్‌ 22: పోలవరం జిల్లా చింతూరు మండలం బొడ్డుగూడెం సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి-30పై ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వారిలో ఒకరు సజీవ దహనమవ్వగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న లారీని, భద్రాచలం…

Read More

అర్ధరాత్రి ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి! 3 నెలల్లో రెండోసారి..

యాదాద్రి, ఆగస్ట్‌ 22: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని హెజిలో ఫార్మా కంపెనీలో శుక్రవారం రాత్రి భారీ శబ్దంతో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 11 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించారు. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో రియాక్టర్ పేలడంతో భారీ శబ్దం వినిపించింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు…

Read More

అయ్యో బిడ్డా.. చింత గింజలు గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి!

ఆదిలాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. చింత గింజలు గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. పట్టణ శివారు ప్రాంతంలోని కేఆర్కే కాలనీలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆడుకుంటూ చింతకాయలు తింటున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేఆర్కే కాలనీకి చెందిన మంగేశ్‌ అనే ఏడేళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో చింతకాయలు తింటూ వాటిలోని గింజలను నములుతున్నాడు. అయితే అనుకోకుండా గింజలు ఒకేసారి గొంతులో…

Read More

అనిల్ రావిపూడి.. ది మాస్టర్ ఆఫ్ ప్రమోషన్స్

పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ చేయడం ఎలా అనే స్కూల్ ఉంటే.. దానికి ప్రిన్సిపల్‌ అనిల్ రావిపూడి. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి మరి. నిర్మాతల జేబులోంచి డబ్బు తీయకుండా.. తన మూవీ గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయడంలో అనిల్ సిద్ధహస్తుడు. తాజాగా వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమాకు అదిరిపోయే టైటిల్ పెట్టారీయన. మరి అదేంటో తెలుసా..? చూస్తున్నారుగా.. షూటింగ్‌కు షూటింగ్, ప్రమోషన్స్‌కు ప్రమోషన్స్.. వేటికవే ప్లాన్ చేసుకుంటున్నారు అనిల్ రావిపూడి. మామూలుగా ఎవరైనా అకేషన్ దొరికితే…

Read More

Gaja 2026: గజ సినిమా టీజర్ టాక్.. మంచి రెస్పాన్స్ వస్తుంది..

ఈ రోజుల్లో భారీ సినిమాల కంటే కొన్నిసార్లు చిన్న సినిమాలే తమ కంటెంట్‌తో సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. అలా వస్తున్న సినిమానే గజ.. సతీష్ జై నటిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ నుంచే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గజ సినిమాలోని మరిన్ని విశేషాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం.. సతీశ్‌ జై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘గజ’ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తక్కువ టైమ్‌లోనే…

Read More