Andhra: వరలక్ష్మి వ్రతం కోసం ఇంట్లో చెట్టుకు ఉన్న కొబ్బరికాయలు తెంపారు.. తీరా చూస్తే..
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఓ అరుదైన కొబ్బరికాయ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా కొబ్బరికాయలు 300 నుంచి 600 గ్రాముల వరకు బరువు ఉంటాయి. కానీ అంబాజీపేటకు చెందిన రైతు దొమ్మేటి అశోక్ కుమార్ ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుకు ఏకంగా ఒక కేజీ 240 గ్రాముల బరువున్న భారీ కొబ్బరికాయ కాసింది. సాధారణ కాయలతో పోలిస్తే దాదాపు రెండింతల బరువున్న ఈ కాయను చూసి అశోక్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆశ్చర్యం…