Snakes: పాముల గురించి మనం నమ్మే పచ్చి అబద్ధాలు ఇవే.. అసలు నిజాలు ఏంటంటే..?
భూమిపై అత్యంత రహస్యమైన, ఆసక్తికరమైన జీవుల్లో పాములు ముందు వరుసలో ఉంటాయి. ప్రాచీన కాలం నుంచి పాముల చుట్టూ అల్లుకున్న కల్పిత కథలు, సినిమాల్లో చూపించే నాగిని సీన్లు ప్రజల్లో ఎన్నో మూఢనమ్మకాలను నాటాయి. బూర ఊదితే నాట్యం చేస్తాయని, పాలు తాగుతాయని, కొడితే పగ పడతాయని తరతరాలుగా నమ్ముతున్నాం. అయితే నేటి ఆధునిక జీవశాస్త్రం పాముల శరీర నిర్మాణం, వాటి వేట సామర్థ్యాల వెనుక ఉన్న అసలు రహస్యాలను బట్టబయలు చేసింది. పాములకు గాలి పీల్చుకోవడానికి…