పాలు, పన్నీర్, పప్పులు.. గింజలు.. ఈ ఒక్కటి తీసుకుంటే.. ఇక వాటితో పనే ఉండదు!
మాంసాహారానికి దీటుగా శాకాహారులకు పూర్తి స్థాయి ప్రొటీన్‌ను అందించే అద్భుతమైన ఆహార పదార్థం సోయా. గుడ్డు, చికెన్, మటన్‌లతో సంబంధం లేకుండా కేవలం సోయా తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన మాంసకృత్తులు పుష్కలంగా లభిస్తాయి. సోయా మొక్కల వేర్లలో ఉండే రైజోబియం అనే మంచి బ్యాక్టీరియా గాలిలోని నైట్రోజన్‌ను గ్రహించి గింజల్లో ప్రొటీన్లు, అమినో యాసిడ్లు తయారవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే దీనిని సంపూర్ణ ప్లాంట్ ప్రొటీన్ ఫుడ్‌గా పిలుస్తారు. రోజూ ఒక కప్పు మీల్‌మేకర్ లేదా…