ఎందుకు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అంత పెద్ద హిట్ అయింది? ఆసక్తికర కారణాలు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ సిరీస్‌లలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. డ్రాగన్లు, రాజ్యాలు, యుద్ధాలు, కుట్రలు, ప్రేమలు, ద్రోహాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సిరీస్.. టీవీ చరిత్రలోనే ఒక సంచలనంగా నిలిచిపోయింది. ఐరన్ థ్రోన్‌పై ఆధిపత్యం కోసం జరిగే పోరాటమే కథకు కేంద్రబిందువు. వెస్టెరోస్‌లోని రాజ కుటుంబాలు, శక్తివంతమైన నాయకులు, యోధులు.. తమకు కావాల్సిన అధికారం కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. ఎవరు ఎప్పుడు మిత్రుడిగా మారతారో, ఎప్పుడు శత్రువుగా మారతారో…