విశ్వకవి సాక్షిగా సరికొత్త చరిత్ర.. బెంగాల్‌లో నూతన శకం ఆరంభం.. సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026, మే 9వ తేదీ ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోనుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా బెంగాల్ గడ్డపై భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం కొలువుదీరింది. కోల్‌కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కన్నుల పండువైన కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆయన చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు….