Cooking Oil: సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. వంటనూనెపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ధరలు!
లీటర్ పామాయిల్ ప్యాకెట్ రిటైల్‌గా రూ.127కి చేరింది. ఫ్రీడమ్ సన్‌ప్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ రూ.174, వేరుశనగ ఆయిల్ ప్యాకెట్ రూ.180లకు అమ్ముతున్నారు. రెండు వారాల కిందట ధరలతో పోల్చుకుంటే ప్యాకెట్‌కు15-20 రూపాయలు పెరిగిపోయింది. ఇక 15 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ డబ్బా గతంలో రూ.2450 ఉంటే ఇప్పుడు రూ.2600కు విక్రయిస్తున్నారు. యుద్ధం ఇలానే కొనసాగితే ఆయిల్ రేట్లు అందనంత దూరానికి వెళ్తాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారస్తులు. ప్రపంచంలోనే వంటనూనెల దిగుమతిలో భారత్ అగ్రగామిగా ఉంది….