GT vs SRH Result: చెత్త బ్యాటింగ్‌తో చిత్తుగా ఓడిన హైదరాబాద్.. ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్..!
ఇండియన్ ప్రిమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా జరిగిన 56వ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ పోరులో హైదరాబాద్ జట్టు 82 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. లక్ష్య ఛేదనలో ఏమాత్రం పోరాటపటిమ ప్రదర్శించలేకపోయిన హైదరాబాద్ బ్యాటర్లు, గుజరాత్ బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలారు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో…