Bigg Boss 10 Telugu: అగ్నిపరీక్షలో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారుగా.. హెయిర్ కట్ కోసం అమ్మాయిల పోటీ..
బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే సామాన్యుల ఎంపిక కోసం అగ్ని పరీక్ష 2 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సైతం హౌస్ లోకి వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ హౌస్ లోకి వెళ్లడానికి ముందే టాస్కుల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. సెలబ్రిటీలు నేరుగా బిగ్ బాస్‌లోకి వచ్చి తమను తాము నిరూపించుకోవడానికి టాస్క్‌లు ఆడతారు. కానీ సామాన్యులు మాత్రం అంతకంటే కఠినమైన టాస్క్‌లను ఇక్కడే ఎదుర్కోవాల్సి వస్తోంది….