ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. ఉలిక్కిపడ్డ అధికారులు! అంతలోనే కాల్పులు..
వారణాసి విమానాశ్రయంలో ఆదివారం ఉదయం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ముంబై వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడు ఆయుధాల తనిఖీ సమయంలో ప్రమాదవశాత్తు కాల్పులు జరపడంతో ఇద్దరు ఏఏఐసీఎల్ఏఎస్ స్క్రీనర్లు గాయపడ్డారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. విమానాశ్రయ డైరెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం, ఆగస్టు 16న ఉదయం సుమారు 9.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు చెందిన కమలేష్ రాయ్ అనే…