Janhvi Kapoor : ఏంటీ.. పెద్దిలో జాన్వీ కపూర్‏కు డబ్బింగ్ చెప్పింది ఈ అమ్మడా.. ? టీవీల్లో చాలా ఫేమస్..

Janhvi Kapoor : ఏంటీ.. పెద్దిలో జాన్వీ కపూర్‏కు డబ్బింగ్ చెప్పింది ఈ అమ్మడా.. ? టీవీల్లో చాలా ఫేమస్..


ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ విజయంతో దూసుకుపోతుంది పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ మూవీకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో చరణ్ యాక్టింగ్, మేకోవర్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా నటనతో చిరంజీవిని మించిపోయాడంటూ సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. దేవర తర్వాత జాన్వీ నటించిన రెండో తెలుగు సినిమా ఇది. మొదటి నుంచి తన పాత్రపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే.. పెద్ది చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది జాన్వీ. అచ్చియమ్మ పాత్రలో అచ్చం పల్లెటూరి అమ్మాయిగా తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో జాన్వీ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.. ? ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

గతంలో దేవర సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు ఆర్జే శ్వేత డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు పెద్ది చిత్రంలో జాన్వీ పాత్రకు సింగర్ సమీరా భరద్వాజ్ డబ్బింగ్ చెప్పింది. ఈ విషయాన్ని సమీరా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో పెద్ది డబ్బింగ్ ఫోటోస్ షేర్ చేస్తూ.. జాన్వీ కపూర్ కు డబ్బింగ్ చెప్పినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన పెద్దిలో నన్ను భాగం చేసినందుకు చాలా ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. సింగర్ సమీరా భరద్వాజ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. అలాగే టీవీల్లో పలు ప్రోగ్రామ్స్ చేస్తూ..యాంకరింగ్ చేస్తూ అలరిస్తుంటుంది. ఇవే కాకుండా అటు గాయనిగానూ బిజీగా ఉంటుంది. హోస్టుగా, సింగర్ గా సినీ ప్రియుల మనసులు గెలుచుకుంది. సమీరా భరద్వాజ్ కూతురు ఆద్య కూడా చాలా ఫేమస్. ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే షోలో సమీరా కూతురు చాలా అల్లరి చేస్తూ పాపులర్ అయ్యింది. మొత్తానికి పెద్ది సినిమాలో జాన్వీ పాత్రకు విజయనగరం యాసలో డబ్బింగ్ చెప్పి అలరించింది సమీరా.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

సమీరా భరద్వాజ్ పోస్ట్…

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *