ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్! వచ్చే 5-స్టేట్ ఎలక్షన్‌లో ఇండీ దారేది?
శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతారంటారు. ప్రస్తుతం దేశ రాజకీయాలు ఈ సమీకరణంతోనే నడుస్తున్నాయి. ముఖ్యంగా విపక్ష కూటమి. పైకి చూస్తే ఎవరికి వారే అన్నట్టుగా కనిపిస్తున్నా.. రాజకీయ శత్రువు కళ్ల ముందు కనిపించే సరికి.. ఏకం అవ్వాలనే కసి పెరుగుతోంది. నిజానికి, విపక్షాలకీ కలవాలనుంది. కలవడానికి బలమైన కారణాలూ ఉన్నాయ్. ఇండీ కూటమి విచ్ఛిన్నమైనా విపక్షాల్ని ఏకం చేయడానికి అస్త్రాలు వరుసగా దొరుకుతున్నాయ్. అందులో మొదటిది లోక్‌సభ స్పీకర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం. అఫ్‌కోర్స్ ఆ తీర్మానం…