Headlines

ఆర్బీఐ స్కీమ్‌కు అనూహ్య స్పందన.. ఎన్నారైల నుంచి పోటెత్తిన డాలర్లు

విదేశీ మారక నిధులను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన వ్యూహాత్మక ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలనిచ్చాయి. మిడిల్‌ఈస్ట్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటడం, దిగుమతులు పెరగడంతో విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. డాలర్ ముందు రూపాయి విలువ సైతం భారీగా బలహీనపడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్బీఐ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి, విదేశీ మారక నిధులను దేశం వైపు మళ్లించేందుకు ప్రత్యేక యూఎస్ డాలర్-రూపాయి స్వాప్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ…

Read More

దొంగలు ఎత్తుకెళ్తారనీ.. ఏకంగా ఇంటి పైకప్పుపైకి కారు ఎక్కించిన యజమాని! వీడియో వైరల్

బీహార్, సెప్టెంబర్ 4: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌ను భారీ క్రేన్‌ సాయంతో పైకి ఎత్తి, నివాస భవనం పైకప్పుపై జాగ్రత్తగా ఉంచడం కనిపిస్తోంది. వాహనాన్ని క్రేన్‌ ద్వారా పైకి లేపి, ఇంటి పైకప్పుపైకి చేర్చిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాహనం యజమాని ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లనున్నాడు. తాను లేని సమయంలో వాహనాన్ని ఇంటి ముందుగానీ, రోడ్డుపైగానీ పార్క్ చేస్తే దొంగతనానికి గురయ్యే అవకాశం ఉందని…

Read More

బుర్ర పాడు టేస్ట్ మావ.. కీమా దోశ ధర ఇంత తక్కువా..? ఎక్కడంటే..?

విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లే మార్గంలో, లేదా వైజాగ్ నుంచి విజయవాడకు ప్రయాణించేటప్పుడు, యర్రవరం సమీపంలోని యస్.తిమ్మాపురం అనే గ్రామంలో ఒక ప్రత్యేకమైన రుచి గల టిఫిన్స్ అందించే చిన్న పాక ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం కట్టెల పొయ్యి మీద తయారుచేసే మటన్ కీమా పెసరట్లకు పేరు పొందింది. ఇక్కడ ఇంట్లో వాళ్లే స్వయంగా రుబ్బుకున్న పిండితో పెసరట్లు వేస్తారు. కట్టెల పొయ్యిపై చేసే ఈ పెసరట్ల రుచి ఎంతో అద్భుతంగా ఉంటుందని చెబుతారు. ఈ…

Read More

అరెరె ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. అరటిపండు గురించి ఈ నిజాలు తెలిస్తే..

అరటిపండును పేదల పోషకాహారంగా చెబుతుంటారు. తక్కువ ధరలో లభించే ఈ పండులో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఒక అరటిపండు శరీరానికి సుమారు 112 క్యాలరీల తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో 1 గ్రాము ప్రొటీన్, 29 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ఫైబర్, 0.4 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి, ఫోలేట్, నియాసిన్, రాగి, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి సూక్ష్మపోషకాలు మెండుగా లభిస్తాయి. రోజూ…

Read More

Rohit Sharma: వన్డే వరల్డ్ కప్ రియల్ కింగ్ రోహితే.. ఆ రికార్డుల్లో హిట్ మ్యాన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు

Rohit Sharma: గత కొన్ని రోజులుగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ లేరంటూ వస్తున్న వార్తలను బీసీసీఐ ఖండించింది. గురువారం జరిగిన రివ్యూ మీటింగ్ అనంతరం బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా మాట్లాడుతూ “రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు, ఇలాంటి పుకార్లకు తావివ్వకండి” అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రపంచకప్ టోర్నీల్లో హిట్ మ్యాన్ నమోదు చేసిన రికార్డులు…

Read More

మీసాల కృష్ణుడి ఆలయం.. తెలంగాణలో ఎక్కడ ఉందంటే..?

శ్రీకృష్ణుడు అనగానే మన కళ్ల ముందు నెమలి పింఛం, చేతిలో వేణువు, ముఖంపై అందమైన చిరునవ్వుతో కూడిన దివ్యరూపం కనిపిస్తుంది. కానీ సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని చెల్లాపూర్‌లో మాత్రం కృష్ణుడు అందుకు భిన్నమైన రూపంలో దర్శనమిస్తాడు. కోరమీసాలతో భక్తులకు దర్శనమిచ్చే ఈ వేణుగోపాలస్వామి ప్రత్యేకత వెనుక దాదాపు 600 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్‌లో కొలువైన ఈ స్వామిని భక్తులు ‘మీసాల కృష్ణుడు’, ‘మీసాల వేణుగోపాలస్వామి’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు….

Read More

Australia Continent: ఏటా 7 సెంటీమీటర్లు కదులుతున్న ఆస్ట్రేలియా ఖండం.. విస్తుపోయే నిజాలు

Australia Continent: ఆస్ట్రేలియా ఖండం భూమిపైనే అత్యంత వేగంగా కదులుతూ ప్రతి ఏటా ఏడు సెంటీమీటర్ల మేర ఉత్తర ఈశాన్య దిశగా జరుగుతోంది. ప్రపంచ పటంలో ఎంతో స్థిరంగా కనిపించే ఈ భూభాగం వాస్తవానికి ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. ఖండాలు ఎప్పుడూ ఒకే చోట ఉండవనే విషయం భౌగోళికంగా అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలోని మిగతా అన్ని ఖండాల కంటే అత్యంత వేగంగా ఈ ఖండం తన స్థానాన్ని మార్చుకుంటోంది. ఇది ప్రతిరోజూ చూసేందుకు…

Read More

Sachin Joshi : హీరో సచిన్ జోషి గుర్తున్నాడా.. ? ఆయన భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఎవరంటే..

సినీ పరిశ్రమలోకి ప్రతిరోజూ ఎంతోమంది ఎన్నో ఆశలతో అడుగుపెడుతుంటారు. అందులో కొందరు మాత్రమే వరుస విజయాలతో రాణిస్తే, మరికొందరు అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేక సినిమాలకు దూరమవుతుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరో సచిన్ జోషి ఒకరు. అయితే ఆయన భార్య కూడా ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను ఏలిన ప్రముఖ హీరోయిన్ అనే విషయం చాలామందికి తెలియదు. ప్రముఖ వ్యాపారవేత్త జె.ఎమ్. జోషి కుమారుడైన సచిన్ జోషి, నటనపై ఉన్న ఆసక్తితో 2002లో ‘మౌనమేలనోయి’ చిత్రంతో…

Read More

9 రోజుల పాటు చీకటిలోనే.. చివరకు ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు.. నేపాల్‌లో అద్భుతం!

ఖాట్మండు: ఊహించని ప్రకృతి విపత్తు.. చుట్టూ ఎటుచూసినా మట్టి, బండరాళ్లు.. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి.. అయినా ప్రాణాలపై ఆశ వదులుకోలేదు. చివరకు దాదాపు తొమ్మిది రోజుల తర్వాత సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటపడటంతో నేపాల్‌లో అద్భుత ఘటన చోటుచేసుకుంది. రసువా జిల్లాలోని అప్పర్ త్రిశూలి-3A జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరిని శుక్రవారం (సెప్టెంబర్ 04) నేపాల్ ఆర్మీ, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. రక్షించిన వారిని…

Read More

2027 World Cup: గంభీర్, గిల్ కీలక ప్రతిపాదన.. వన్డే ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ భారీ స్కెచ్..!

2027 World Cup: వన్డే ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా దక్షిణాఫ్రికాతో ప్రత్యేక వన్డే సిరీస్‌ ఆడేందుకు టీమిండియా ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్‌ మేనేజ్‌మెంట్ చేసిన అభ్యర్థన మేరకు బీసీసీఐ.. క్రికెట్ సౌత్‌ ఆఫ్రికాతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్‌లో ఎక్కువ మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలోనే జరగనున్న నేపథ్యంలో అక్కడే 4 నుంచి 6 వన్డేల సిరీస్‌ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఐపీఎల్‌ 2027…

Read More