Watch: ఇది కదా నిజమైన నాగుల పంచమి.. పూజలు చేస్తుండగా.. నాగుపాము ప్రత్యక్షం!
పెద్దపల్లి జిల్లా ఓదెలలో నాగుల పంచమి పర్వదినం సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. పార్వతి శంభు లింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో భక్తులు పూజలు నిర్వహిస్తున్న సమయంలో నాగుపాము ప్రత్యక్షమవడంతో భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. నాగదేవత తమ పూజలకు మెచ్చి స్వయంగా దర్శనమిచ్చిందని పలువురు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా ఆలయంలోని పుట్ట వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అదే సమయంలో నాగదేవత విగ్రహం సమీపంలోకి…