నాకు షర్మిలతో పోలిక ఏంటి..? TV9 క్రాస్ ఫైర్‌లో కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్..
రాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో తన భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ నేపథ్యం, పార్టీల విజయపరాజయాలువంటి అంశాలపై స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలతో తనను పోల్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తమ ఇద్దరి నేపథ్యాలు, రాజకీయ ప్రయాణాలు పూర్తిగా భిన్నమైనవని తెలిపారు. తనకు షర్మిలకు పోలికేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసిన షర్మిల, చివరకు పార్టీని కాంగ్రెస్‌లో…