వానరాల మజాకా.. తాజ్ మహల్ ఫౌంటెన్‌లో కోతుల జలకాలాటలు చూడాలి.. ఎండ వేడికి చెక్ పెడుతూ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు కేవలం మనుషులే కాకుండా, నోరులేని మూగజీవాలు, జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే వేడి నుంచి కాస్త ఉపశమనం పొందడానికి జంతువులు కూడా వినూత్న మార్గాలను వెతుక్కుంటున్నాయి. తాజాగా, ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ వేదికగా కోతుల గుంపు చేసిన ఒక అల్లరి పసివాళ్లలాంటి పనే ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా…