Toxic Movie : యశ్‌తో సినిమా కచ్చితంగా ఉంటుంది.. కానీ.. నిర్మాత దిల్ రాజు..
రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా రూపొందిన టాక్సిక్ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, చిత్ర బృందాన్ని, ముఖ్యంగా నిర్మాత కేవీఎన్, యష్‌లను విశేషంగా ప్రశంసించారు. తెలుగు సినీ పరిశ్రమకు దిల్ రాజు, శిరీష్ అందించిన సేవలను ప్రస్తావిస్తూ, వేదికపై వారిని ఆహ్వానించారు. దిల్ రాజు తన ప్రసంగాన్ని నిర్మాత కేవీఎన్ విజన్‌ను ప్రశంసించడంతో ప్రారంభించారు. కేవీఎన్‌ను దేశంలోనే నంబర్ వన్ నిర్మాతగా…