Swine Flu: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వైన్ ఫ్లూ (H1N1) కలవరం.. ప్రధాన లక్షణాలు ఇవే
Swine Flu: డిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో H1N1 (స్వైన్ ఫ్లూ) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న తేమతో కూడిన వాతావరణం, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా ఉద్ధృతమవుతున్నాయి. కొందరిలో ఆక్సిజన్ స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం, తీవ్రమైన శ్వాస సమస్యలు ఎదురవుతున్నట్లు వైద్యులు తెలిపారు..ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు సైతం H1N1 బారిన పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క డిల్లీలోనే 1,349కి పైగా H1N1…