తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలపై నా స్టాండ్ ఎప్పుడూ ఒక్కటేః పవన్ కల్యాణ్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యల చుట్టూ తిరుగుతున్న రాజకీయ మంట ఇంకా చల్లారలేదు. తాను తెలంగాణ ప్రజలను కించపరచలేదని పవన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఆయనపై విమర్శల దాడి మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్ (X) వేదికగా పవన్ కల్యాణ్ తెలంగాణపై తన స్థిరమైన వైఖరిని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలపై తన వైఖరి ఎల్లప్పుడూ ఒక్కటేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్…