Om-Shaped Temple: ప్రపంచంలోనే తొలి ఓం ఆకార ఆలయం ఇదే.. 1,008 శివ విగ్రహాల అద్భుతం!
Om Aakar Temple Rajasthan: రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఉన్న జాదన్ గ్రామం ఆధ్యాత్మికత, అద్భుతమైన నిర్మాణశైలికి ప్రసిద్ధి చెందుతోంది. ఇక్కడ కొలువుదీరిన ఓం ఆకార ఆలయం (Om Aakar Temple) ప్రపంచంలోనే తొలి ఓం ఆకారంలో నిర్మించిన ఆలయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. హిందూ తత్వశాస్త్రంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ‘ఓం’ విశ్వం, సృష్టి, చైతన్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ విశ్వ నాదాన్ని రాతి నిర్మాణంగా ఆవిష్కరించినట్టుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. 250 ఎకరాల్లో విస్తరించిన…