Headlines

Tiger Shroff: టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో లేటెస్ట్ అప్ డేట్స్ ఇవే..

ఒకప్పుడు అండర్‌వరల్డ్ బెదిరింపులతో వణికిన బాలీవుడ్‌ను.. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ల కాల్పులు, కిడ్నాప్ బెదిరింపులు కలవరపెడుతున్నాయి. లేటెస్ట్‌గా నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన..బాలీవుడ్‌లో మరోసారి భయాందోళనలు రేపింది. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన తర్వాత.. బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న అనిల్ పండిట్ పేరు తెరపైకి వచ్చింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసినవారిని వదిలిపెట్టబోమంటూ అతడి పేరుతో పోస్ట్ అయిన సోషల్ మీడియా పోస్టులు, ఆడియో క్లిప్‌లు కలకలం రేపుతున్నాయి. హర్యానాకు చెందిన అనిల్ పండిట్‌…

Read Full News

రోగనిరోధక శక్తిని పెంచే దివ్యౌషధం.. దగ్గు, జలుబు, ఫ్లూకు న్యాచురల్ మెడిసిన్..

ఉసిరిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. తరచుగా ఎదురయ్యే అనారోగ్య సమస్యల నుండి రక్షణ కల్పించడంలో ఉసిరి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయలు విటమిన్ సి కి ప్రసిద్ధి. నారింజ, దానిమ్మకాయల కంటే కూడా ఎక్కువ విటమిన్ సి ఉసిరిలో లభిస్తుంది. ఈ విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచి దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.

Read Full News

ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు!

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. మంగళవారం (అక్టోబర్ 20) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీఎస్‌డీఎంఏ వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి…

Read Full News

Pragyan Ojha: ఒడిశాలో పుట్టి హైదరాబాద్‌లో ఎదిగిన క్రికెటర్.. ఇప్పుడు టీమిండియా చీఫ్ సెలెక్టర్

Pragyan Ojha: భారత క్రికెట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. టీమిండియా పురుషుల సెలక్షన్ కమిటీకి కొత్త చైర్మన్‌గా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్ రమేశ్ పవార్‌కు సెలక్షన్ కమిటీలో చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీఐ అక్టోబర్ 19న అధికారికంగా ప్రకటించింది. అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో ఈ మార్పులు జరిగాయి. అయితే కొత్త కమిటీలో పవార్ సభ్యుడిగా చేరినా.. చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు మాత్రం ఓజాకే దక్కాయి. టెస్టుల…

Read Full News

WhatsApp Web: వాట్సప్‌ వెబ్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌!

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, తన వెబ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటివరకు కేవలం మొబైల్ యాప్ లేదా డెస్క్‌టాప్ యాప్‌లకు మాత్రమే పరిమితమైన వాయిస్, వీడియో కాలింగ్ సౌకర్యం.. ఇప్పుడు నేరుగా వాట్సప్ వెబ్ బ్రౌజర్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. సంవత్సరాలుగా వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఫీచర్‌ను వాట్సప్ సైలెంట్‌గా అందుబాటులోకి తెస్తోంది. ఇకపై కంప్యూటర్ లేదా లాప్‌టాప్ బ్రౌజర్‌లో పనులు చేసుకునే ఉద్యోగులు, విద్యార్థులు ప్రతీసారి…

Read Full News

ఆ ఒక్క సినిమాతో అంతా మారిపోయింది.. అవకాశాలు తగ్గిపోయాయి : సత్య కృష్ణ

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీమణులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో నటి సత్యకృష్ణ కూడా ఒకరు. తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. ఎన్నో సినిమాల్లో తల్లి, అక్క, వదిన వంటి విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తనకు ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు కాకుండా, కొత్తగా కనిపించే క్యారెక్టర్లు చేయాలనే ఆసక్తి…

Read Full News

Rinku Singh: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రింకూ సింగ్.. టాప్ 10లో చోటు

Rinku Singh: టీ20 క్రికెట్‌లో తన సిక్సర్లతో అభిమానులను అలరించే రింకూ సింగ్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ అదరగొడుతున్నాడు. రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో వరుసగా రెండో సెంచరీ సాధించి అరుదైన ఘనత అందుకున్నాడు. గోవాతో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 118 పరుగులు చేసిన రింకూ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కనీసం 50 ఇన్నింగ్స్ ఆడిన బ్యాటర్లలో అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ ఉన్న ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్…

Read Full News

శాంసన్ కాదు.. వైభవ్ సూర్యవంశీకి బదులు ఈ ఆటగాడిని తప్పించండి.. గంభీర్‌పై ఫ్యాన్స్ ఫైర్..!

Vaibhav Sooryavanshi Deserved a Chance in His Place: భారత టీ20 జట్టులో ప్రస్తుతం యువ ఆటగాళ్లకు కొదవ లేదు. అయితే తుది జట్టులో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై చర్చ మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) వరుసగా బెంచ్‌కే పరిమితం కావడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. దేశవాళీ క్రికెట్, జూనియర్ స్థాయిలో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న వైభవ్‌కు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో టీమిండియా…

Read Full News

IND vs NZ: ఈ నలుగురు భారత ఆటగాళ్లకు ఇదే చివరి న్యూజిలాండ్ టూర్.. ఆ తర్వాత కష్టమే..?

Team India New Zealand Tour: భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు సాగే ఈ టూర్‌లో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు జరగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లతో పాటు పలువురు యువ క్రికెటర్లకు కూడా చోటు కల్పించారు. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat…

Read Full News

Summer Coolers: వేసవి వచ్చేస్తోంది.. అతి తక్కువ ధరల్లో ఎయిర్‌ కూలర్లు.. చల్లని గాలి కోసం బెస్ట్ ఆప్షన్లు ఇవే!

Summer Coolers: వేసవి కాలం సమీపిస్తోంది. ఎండల తీవ్రత పెరిగేలోపు ఇంటికి తక్కువ ధరలో ఎయిర్ కూలర్ కొనాలనుకుంటున్నారా? అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న బడ్జెట్ కూలర్లపై ఓ లుక్కేయండి. రూ.5 వేల లోపే కొన్ని మోడళ్లు అందుబాటులో ఉండగా, మరికొన్ని కూలర్లు అంతకంటే తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అయితే ధరతోపాటు కూలింగ్ సామర్థ్యం, వాటర్ ట్యాంక్, గాలి విసిరే దూరం వంటి అంశాలను కూడా పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది. వేసవిలో ఇంటిని చల్లగా ఉంచుకోవాలంటే…

Read Full News