Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? వారం రోజుల్లోనే.. దీపావళి పండక్కి ముందే శుభవార్త..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు తెలంగాణ సర్కార్ శుభవార్త అందించింది. హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి లాటరీ పద్దతి ద్వారా ఇందిరమ్మ టవర్స్‌లలో ఇళ్లను కేటాయిస్తున్నారు. విడతల వారీగా లబ్దిదారులను ఎంపిక చేస్తుండగా.. ఇప్పటికే తొలి విడతలో నగర పరిధిలో కొంతమందికి లాటరీ నిర్వహించి ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. ఇప్పుడు రెండో విడత ఇళ్ల మంజూరు కోసం లాటరీ నిర్వహించేందుకు అధికారులు సిద్దమయ్యారు….