Cooler Tips: మీ ఇంట్లో కూలర్ ఉందా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లైట్ తీసుకుంటే రిస్కే..
ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా ఎయిర్ కూలర్లు తిరుగుతూనే ఉన్నాయి. ఏసీలు కొనలేని సామాన్యులకు, మధ్యతరగతి వారికి ఈ కూలర్లే పెద్ద దిక్కు. అయితే కూలర్ల ద్వారా వేడి నుండి ఉపశమనం లభిస్తున్నప్పటికీ.. మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల అవి ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతున్నాయి. కూలర్ బాడీకి కరెంట్ రావడం, ఆకస్మిక విద్యుత్ షాక్‌ల వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం తరచూ వింటూనే ఉంటాం. అలాగని కూలర్ వాడటం ఆపేయాల్సిన అవసరం…